Sukumar: ద‌ర్శ‌కుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్‌

IT Raids in Director Sukumar Hyderabad Home

  • రెండోరోజూ సినీ ప్ర‌ముఖుల ఇళ్లు, కార్యాల‌యాల్లో ఐటీ అధికారుల సోదాలు
  • ఇవాళ‌ ద‌ర్శ‌కుడు సుకుమార్ ఇంట్లో ఐటీ శాఖ‌ అధికారుల త‌నిఖీలు
  • 'పుష్ప-2' సినిమా భారీ కలెక్షన్ల నేపథ్యంలో మేక‌ర్స్ ఇళ్ల‌తో పాటు డైరెక్ట‌ర్ ఇంటిపై ఐటీ రైడ్స్

హైద‌రాబాద్‌లో రెండోరోజూ సినీ ప్ర‌ముఖుల ఇళ్లు, కార్యాల‌యాల్లో ఐటీ శాఖ అధికారుల సోదాలు కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఇవాళ‌ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు త‌నిఖీలు నిర్వహిస్తున్నారు. ఆయ‌న‌ నివాసంలో బుధవారం తెల్లవారుజామున ఐటీ అధికారులు సోదాలు చేశారు. 

ఇటీవ‌ల విడుద‌లైన 'పుష్ప-2' సినిమా భారీ కలెక్షన్ల నేపథ్యంలో ఈ మూవీ మేక‌ర్స్ (మైత్రి మూవీ మేక‌ర్స్) ఇళ్ల‌పై నిన్న‌టి నుంచి రైడ్స్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆ చిత్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ ఇంట్లోనూ విస్తృతంగా త‌నిఖీలు చేస్తున్నారు. మ‌రోవైపు ప్ర‌ముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్ దిల్ రాజు ఇళ్లు, ఆఫీసులోనూ సోదాలు కొన‌సాగుతున్నాయి. 

అలాగే మైత్రీ మూవీ మేక‌ర్స్ కార్యాల‌యం, నిర్మాత‌లు నవీన్ ఎర్నేని, రవి శంకర్ నివాసాలు, మ్యాంగో మీడియా సంస్థ‌, స‌త్య రంగ‌య్య ఫైనాన్స్‌, నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్‌తో పాటు ఇత‌ర ఫైనాన్స్ కంపెనీల‌లోనూ ఐటీ శాఖ అధికారుల త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. ఆర్థిక వ్య‌వ‌హారాల‌కు సంబంధించిన ప‌లు ప‌త్రాల‌ను ఐటీ అధికారులు ప‌రిశీలిస్తున్నారు. 

  • Loading...

More Telugu News