Balaji: అందుకే సినిమాలకి దూరమయ్యాను: నటుడు బాలాజీ

Balaji Interview

  • 300 సినిమాలకి పైగా చేసిన బాలాజీ 
  • నటి రోహిణికి సొంత అన్నయ్యనే తను
  • చిన్నప్పుడే తల్లిని కోల్పోయామని వెల్లడి
  • రోహిణి - రఘువరన్ వినిపించుకోలేదని వ్యాఖ్య


బాలాజీ .. ఒకప్పుడు నెగెటివ్ షేడ్స్ కలిగిన రోల్స్ కి కేరాఫ్ అడ్రెస్. యుంగ్ విలన్ గా తెరపై ఆయన చాలా దూకుడుగా కనిపించేవారు. నటి రోహిణికి ఆయన సొంత అన్నయ్య. తాజాగా ఆయన 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. " మా నాన్నగారు కొన్ని సినిమాలలో నటించారు .. ఆ తరువాత చైల్డ్ ఆర్టిస్ట్ గా చెల్లెలు బిజీ కావడంతో తన కేర్ టేకర్ గా ఉన్నారు. చెల్లెలి తరువాతనే నాకు అవకాశాలు వచ్చాయి" అని అన్నారు. 

"నేను 8 th క్లాస్ చదువుతూ ఉండగా అమ్మ చనిపోయింది. నా తోడబుట్టినవారు నలుగురు. అప్పుడే నాకు జీవితం అంటే ఏమిటో అర్థమైంది. జీవితంలో ఎంత జాగ్రత్తగా ముందుకు వెళ్లాలనే విషయంలో ఒక అవగాహన పెరిగింది. నేను పెంచి పెద్ద చేసిన రోహిణి భర్త నుంచి విడిపోయినప్పుడు బాధ పడ్డాను. ఆరోగ్యాన్ని కాపాడుకోమని రఘువరన్ కి చెప్పాను. అయినా వారు వినిపించుకోలేదు. ఇద్దరూ కొంత ఆలోచన చేసి ఉంటే బాగుండేదని అనిపిస్తూ ఉంటుంది" అని చెప్పారు.  

"నేను 300 సినిమాలకి పైగా చేశాను. నా పని నేను చేసుకుపోతూ ఉన్నా నాకు పొగరు ఎక్కువ అనుకునే వారు. ఆ మాటలను కూడా నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. ఈటీవీ .. జెమినీ టీవీ వచ్చిన తరువాత నాకు సీరియల్స్ వైపు నుంచి ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ఒకదాని తరువాత ఒకటిగా తెలుగు .. తమిళ సీరియల్స్ చేస్తూ పోవడం వలన, సినిమాల వైపు నుంచి గ్యాప్ పెరిగిపోయింది. ఇక పీఆర్ మెయింటైన్ చేయడం తెలియక పోవడం మరో కారణంగా అనుకోవచ్చు" అని అన్నారు. 

  • Loading...

More Telugu News