Kobali: వేటకొడవళ్లు నేర్చిన యుద్ధమే 'కోబలి' .. తెలంగాణ నేపథ్యంలో సాగే వెబ్ సిరీస్!

Kobali Web Series Update

  • రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ గా 'కోబలి'
  • ప్రధానమైన పాత్రను పోషించిన రవి ప్రకాశ్
  • హాట్ స్టార్ ద్వారా పలకరించే సిరీస్  
  • ఫిబ్రవరి 4 నుంచి స్ట్రీమింగ్


తెలంగాణ నేపథ్యంలో నిన్నమొన్నటి వరకూ టీవీ సీరియల్స్ మాత్రమే పలకరిస్తూ వచ్చాయి. ఇక వెబ్ సిరీస్ లు రూపొందడం ఇటీవలే మొదలైంది. అలా ఇప్పుడు తెలంగాణ నేపథ్యంలో ఒక వెబ్ సిరీస్ రావడానికి సిద్ధమవుతోంది. తెలంగాణలోని ఒక గ్రామంలో జరిగే కథగా నిర్మితమైన ఆ సిరీస్ పేరే 'కోబలి'. ఒకప్పుడు ఇదే టైటిల్ తో త్రివిక్రమ్ - పవన్ సినిమా చేయాలనుకున్నారు గానీ కుదరలేదు.

'కోబలి' టైటిల్ తో రూపొందిన ఈ సిరీస్ లో నటుడు రవి ప్రకాశ్ ప్రధానమైన పాత్రను పోషించాడు. రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో ఈ కథ కొనసాగనుంది. రెండు గ్యాంగుల మధ్య ఆధిపత్య పోరాటమే ప్రధానంగా నడుస్తుంది. రేవంత్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.    

రీసెంటుగా ఈ సిరీస్ నుంచి వదిలిన ట్రైలర్ అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. 'ఎక్కడ చూసినా అంత స్వార్థం .. ద్వేషం. అందువల్లనే యుద్ధాలు జరిగాయి .. జరుగుతున్నాయి' అంటూ హీరో వేటకొడవలితో విరుచుకు పడటం చూపించారు. యాంకర్ శ్యామల .. రాకీ సింగ్ .. జబర్దస్త్ నవీన్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

More Telugu News