mantralayam: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం .. డ్రైవర్, ముగ్గురు విద్యార్ధుల మృతి

- కర్ణాటకలోని సింధనూరు వద్ద బోల్తా పడిన విద్యార్ధులు ప్రయాణిస్తున్న వాహనం
- వేద పాఠశాల విద్యార్ధులు హంపి క్షేత్రానికి వెళుతుండగా ప్రమాదం
- వాహన డ్రైవర్, ముగ్గురు విద్యార్ధుల మృతి
- సింధనూరు ఆసుపత్రికి గాయపడిన విద్యార్ధుల తరలింపు
కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా మంత్రాలయం వేదపాఠశాల విద్యార్ధులు మృతి చెందారు. కర్ణాటకలోని హంపి క్షేత్రంలో జరిగే నరహరి తీర్ధుల ఆరాధనకు 14 మంది వేద పాఠశాల విద్యార్ధులతో వెళుతున్న వాహనం సింధనూరు సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ శివ, ముగ్గురు విద్యార్ధులు అభిలాష, హైవదన, సుజేంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు విద్యార్ధులు గాయపడగా, వారిని సింథనూరు ఆసుపత్రికి తరలించారు.