Mrunalini Thakur: ఫ్లాపుల ప్రభావం నుంచి తప్పించుకోలేకపోతున్న భామలు!

Mrunalini Thakur Special

  • 'సీతా రామం'తో హిట్ కొట్టిన సుందరి
  • తెలుగు ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ 
  • నిరాశ పరిచిన 'ఫ్యామిలీ స్టార్'
  • ఫ్లాపుల ప్రభావంతో తగ్గిన అవకాశాలు  


బుల్లితెరపై ధారావాహికల ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్, సినిమాలలోకి అడుగుపెట్టింది. 'సీతా రామం' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. 'సీతా రామం' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో, ఇక ఇక్కడ తన జోరు కొనసాగడం ఖాయమేనని అంతా అనుకున్నారు. అందుకు తగినట్టుగానే ఆమె 'హాయ్ నాన్న' సినిమాతో నానీ జోడీ కట్టింది. 'ఫ్యామిలీ స్టార్' సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సందడి చేసింది. 

అయితే ఈ రెండు సినిమాలలో 'హాయ్ నాన్న' సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఓ మాదిరిగా ఆకట్టుకుంది. 'ఫ్యామిలీ స్టార్' ఆ మాత్రం కూడా లాగలేకపోయింది. దాంతో ఇప్పుడు ఎవరూ కూడా మృణాల్ ఠాకూర్ ను గురించి ఆలోచన చేసే మేకర్స్ కనిపించడం లేదు. ఈ అమ్మాయి హోమ్లీ లుక్ తోనే బాగుంటుంది అనే విమర్శలను తిప్పికొట్టడానికి మృణాల్ గట్టిగానే ట్రై చేసింది గానీ, పరాజయాలు పడనీయలేదు.

ఏ సినిమా సక్సెస్ అయినా ముందుగా అది హీరో ఎకౌంటులోకి వెళుతుంది. ఫ్లాప్ అయితే మాత్రం, అందుకు కారణాల్లో హీరోయిన్ ఫ్యాక్టర్ కూడా చేరుతుంది! ఈ ఫ్లాప్ హీరోయిన్ ముద్రను ఒక శిలాశాసనం మాదిరి అనుకోవాలి... దానిని మార్చడం ఎవరి వలనా కాదు. అందువలన ఫ్లాపుల బారిన పడిన హీరోయిన్స్ మళ్లీ కనిపించకుండా పోతుంటారు. మృణాల్ ఠాకూర్ విషయంలో మాత్రమే కాదు, రాశీ ఖన్నా, మెహ్రీన్, అనుపమ పరమేశ్వరన్ వీళ్లంతా ఈ మధ్య కాలంలో ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేసినవారే. 

Mrunalini Thakur
Actress
Nani
Vijay Devarakonda
  • Loading...

More Telugu News