Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ ఇప్పుడెలా ఉన్నారో మీరే చూడండి...!

ఈ నెల 16న బాంద్రాలోని తన నివాసంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో ఐదు రోజుల పాటు ముంబయి లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈరోజు ఆయనను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. దాంతో సైఫ్ ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.
సైఫ్ సద్గురు శరణ్ అపార్ట్‌మెంట్‌కు చేరుకోగానే మీడియా ఆయన కారును చుట్టుముట్టింది. గేటు లోపలికి వెళ్లగానే కారు నుంచి దిగి మామూలుగానే నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఆయన చేతికి ఓ కట్టు ఉండటం మినహా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతో హుషారుగా నడవడం వీడియోలో కనిపించింది. వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వీడియో చూసిన ఆయన అభిమానులు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.