Dil Raju: బ్యాంక్‌కు తీసుకెళ్లి లాకర్లు ఓపెన్ చేయించారు: దిల్ రాజు భార్య

Producer Dil Raju Wife Tejaswini Responds on IT Rides in Her Home

  • నిర్మాత దిల్ రాజు ఇళ్లు, కార్యాల‌యాల్లో ఐటీ అధికారుల సోదాలు
  • సినిమా నిర్మాణాల‌కు సంబంధించి త‌మ నివాసం, ఆఫీసుల్లో త‌నిఖీలు జ‌రుగుతున్నాయ‌న్న భార్య‌
  • ఐటీ అధికారులు అడిగిన డాక్యుమెంట్లు, ఇత‌ర రికార్డుల‌ను వారికి అంద‌జేశామ‌ని వెల్ల‌డి

ఈరోజు ఉద‌యం నుంచి టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఇళ్లు, కార్యాల‌యాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. దీనిపై ఆయ‌న భార్య తేజ‌స్విని స్పందించారు. సినిమా నిర్మాణాల‌కు సంబంధించి త‌మ ఇళ్లు, కార్యాల‌యాల్లో త‌నిఖీలు జ‌రుగుతున్నాయ‌ని ఆమె తెలిపారు. 

సోదాల్లో భాగంగా ఐటీ అధికారులు అడిగిన డాక్యుమెంట్లు, ఇత‌ర రికార్డుల‌ను వారికి అంద‌జేసిన‌ట్లు ఆమె పేర్కొన్నారు. అలాగే బ్యాంకు వివ‌రాలు కూడా ఇచ్చామ‌న్నారు. అలాగే అధికారులు త‌న‌ను బ్యాంక్‌కు తీసుకెళ్లి లాక‌ర్లు ఓపెన్ చేయించార‌ని ఆమె తెలిపారు. దాంతో బ్యాంకు లాక‌ర్లు ఓపెన్ చేసి చూపించిన‌ట్లు తేజ‌స్విని చెప్పారు.  

కాగా, హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్ లో ఉన్న‌ నిర్మాత దిల్ రాజు ఇళ్ల‌లో ఈరోజు ఉద‌యం నుంచి ఐటీ సోదాలు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. దిల్‌రాజు ఇళ్లు, ఆఫీసులతో పాటు ఆయ‌న సోద‌రుడు శిరీష్, కూతురు హన్షిత రెడ్డి ఇళ్లలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. 

అలాగే మైత్రీ మూవీ మేక‌ర్స్ కార్యాల‌యం, నిర్మాత‌లు నవీన్ ఎర్నేని, రవి శంకర్ నివాసాలు, మ్యాంగో మీడియా సంస్థ‌, స‌త్య రంగ‌య్య ఫైనాన్స్‌, నిర్మాత అభిషేక్ అగ‌ర్వాల్‌తో పాటు ఇత‌ర ఫైనాన్స్ కంపెనీల‌లోనూ ఐటీ రైడ్స్ జ‌రుగుతున్నాయి. ఏక కాలంలో ఎనిమిది చోట్ల 65 బృందాలు తనిఖీలు నిర్వ‌హిస్తున్నాయి. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్, గ‌చ్చిబౌలి, కొండాపూర్‌, హైటెక్ సిటీల‌లో సోదాలు కొన‌సాగుతున్నాయి. 


  • Loading...

More Telugu News