Meenakshi Choudary: ఇక మీనాక్షి చౌదరి హవా మొదలైనట్టే!

Meenakshi Chaudary Special

  • 'లక్కీ భాస్కర్'తో హిట్ కొట్టిన మీనాక్షి 
  • ఆ వెంటనే బ్లాక్ బస్టర్ ఇచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం'
  • అందరి దృష్టి ఇప్పుడు మీనాక్షి పైనే 
  • స్టార్ హీరోల సినిమాలతో బిజీ కానున్న బ్యూటీ


మీనాక్షి చౌదరి... మంచి హైట్... అందుకు తగిన ఆకర్షణీయమైన రూపం ఆమె సొంతం. చిన్న సినిమాతో ఆమె టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఎక్కువగా ఆమెను సెకండ్ హీరోయిన్ చాన్సులే వెతుక్కుంటూ వచ్చాయి. వాటితోనే సరిపెట్టుకుంటూ ఆమె ముందుకు వెళ్లడం మొదలుపెట్టింది. 'గుంటూరు కారం' సినిమాలో మీనాక్షికి పెద్ద రోల్ ఇవ్వకపోయినా, ఆమెను త్రివిక్రమ్ చాలా గ్లామరస్ గా చూపించాడు. ఈ అమ్మాయిని మెయిన్ హీరోయిన్ గా తీసుకోవచ్చని అనుకునేలా చేశాడు. 

ఈ నేపథ్యంలోనే మీనాక్షికి 'లక్కీ భాస్కర్' సినిమాతో పెద్ద హిట్ పడింది. ఆ సక్సెస్ ను ఆమె ఎంజాయ్ చేస్తూ ఉండగానే, 'సంక్రాంతికి వస్తున్నాం' థియేటర్లలో అడుగుపెట్టింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. నటనకి స్కోప్ ఉన్న పాత్ర మీనాక్షికి దక్కడం... గ్లామర్ పరంగాను ఆమెకి మంచి మార్కులు పడటం కలిసొచ్చింది. ఈ సినిమాతో తన కెరియర్లోనే ఆమె హిట్ ను సొంతం చేసుకుంది. 

ఈ ఏడాది ఆరంభంలోనే మీనాక్షి ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ పడింది. దాంతో పెద్ద పెద్ద బ్యానర్ల నుంచి ఆమెకి అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తోంది. స్టార్ హీరోల సరసన ప్రధానమైన నాయికగా ఆమె కనిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అంటున్నారు. త్వరలోనే ఆమె ప్రభాస్, మహేశ్ బాబు, చరణ్, ఎన్టీఆర్, రామ్, నితిన్ వంటి హీరోల సరసన మెరిసే అవకాశం లేకపోలేదు. టాప్ త్రీ గా చెప్పుకునే పూజ హెగ్డే, రష్మిక, కీర్తి సురేశ్ ఏమంత యాక్టివ్ గా లేకపోవడం... శ్రీలీల, కృతి శెట్టి జోరు తగ్గడం మీనాక్షికి కలిసొచ్చిందని అంటున్నారు. 

Meenakshi Choudary
Actress
Venkatesh Daggubati
Dulquer Salmaan
  • Loading...

More Telugu News