Vinayakan: మ‌ద్యం మ‌త్తులో 'జైల‌ర్' విల‌న్ వీరంగం.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

Actor Vinayakan Hurls abuse at Neighbour Stirs Controversy Over Obscene Behaviour

  • మ‌రోసారి అనుచిత ప్రవర్తవ‌న‌తో వార్తల్లో నిలిచిన న‌టుడు వినాయకన్ 
  • మ‌ద్యం మ‌త్తులో పొరుగింటివారిని దుర్భాషలాడిన వీడియో వైర‌ల్‌
  • రజనీకాంత్ జైలర్‌లో ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించిన‌ వినాయకన్

మ‌ల‌యాళ న‌టుడు వినాయ‌క‌న్ మ‌ద్యం మ‌త్తులో వీరంగం సృష్టించారు. ఆయ‌న త‌న ఇంటి బాల్క‌నీలో లుంగీ క‌ట్టుకుని నిల‌బ‌డి పొరుగింటివారితో గొడ‌వ ప‌డ్డారు. వారిపై అరుస్తూ, బూతులు తిడుతున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

మ‌ద్యం తాగ‌డంతో తూగుతూ స‌రిగ్గా నిల‌బ‌డ‌లేని ప‌రిస్థితిలో ఆయ‌న క‌నిపించారు. ఇటీవల విమానాశ్రయ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించినందుకు అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎయిర్ పోర్ట్ లో ఫ్లోర్ పై కూర్చుని సీన్ క్రియేట్ చేశాడు.

అలాగే ఇంట్లో భార్యతో గొడవల కార‌ణంగా ఆయ‌న‌పై పోలీసు కేసు నమోదైంది. అయితే, ఇలాంటి ప్ర‌వ‌ర్త‌న‌తో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తుండ‌టంతో ఆయ‌న్ను సినిమా ఇండ‌స్ట్రీ నుంచి బ‌హిష్క‌రించాల‌ని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. 

ఇక వినాయకన్ మలయాళం, తమిళ చిత్రాలలో న‌టించి మంచి పేరు సంపాదించారు. మలయాళంలో ఆయ‌న చివరిగా నటుడు ఉన్ని ముకుందన్ న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్‌ 'మార్కో'లో కనిపించారు. ఈ సినిమా రికార్డుస్థాయిలో రూ. 100 కోట్లు వ‌సూలు చేయ‌డం విశేషం. అలాగే తమిళంలో వినాయకన్ చివరిగా సూప‌ర్ స్టార్‌ రజనీకాంత్ 'జైలర్' మూవీలో కనిపించాడు. ఇందులో విల‌న్‌ వర్మన్‌గా నటించారు.

More Telugu News