Khushboo: వెంకటేశ్ తో 'చంటి' చేయలేకపోవడానికి కారణం ఇదే: నటి ఖుష్బూ

Khushboo Interview

  • 'కలియుగ పాండవులు'తో పరిచయమైన ఖుష్బూ 
  • తనని వెంకటేశ్ సిఫార్స్ చేశారని వెల్లడి 
  • చిరంజీవి - బాలయ్యతో చేయలేకపోయానని వ్యాఖ్య 
  • తమిళంలో రెండు పెద్ద సినిమాల వల్ల చంటి చేయలేకపోయానన్న ఖుష్బూ  


వెంకటేశ్ - మీనా జోడీగా 'చంటి' సినిమా రూపొందింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, ఇళయరాజా దర్శకత్వం వహించారు. 1992లో విడుదలైన ఈ సినిమా, మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో మీనా కెరియర్ రాకెట్ వేగంతో దూసుకుపోయింది. అలాంటి ఈ సినిమా గురించి 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుష్బూ ప్రస్తావించారు. 

''వెంకటేశ్ గారు ఫస్టు మూవీ 'కలియుగ పాండవులు' సినిమాతో నేను తెలుగులోకి అడుగుపెట్టాను. ఆ సినిమాకి నన్ను సిఫార్స్ చేసింది వెంకటేశ్ గారే. ఒక హిందీ సినిమాలో నన్ను చూసి సిఫార్స్ చేశారు. ఆ తరువాత నాగార్జునగారితో చేశాను. చిరంజీవి గారు .. బాలకృష్ణ గారితో చేసే అవకాశాలు వచ్చాయి. కానీ అప్పటికే నేను తమిళంలో బిజీ అయ్యాను. తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ వెళ్లిపోవడం కూడా అందుకు ఒక కారణం" అని అన్నారు.

"నిజానికి వెంకటేశ్ గారితో కలిసి 'చంటి' సినిమా కూడా నేనే చేయాలి. అయితే డేట్స్ కుదరలేదు. నేను 'చంటి' చేయాలనుకుంటే రెండు తమిళ సినిమాలు వదులుకోవాలి. ఒక సినిమాలో హీరో రజనీకాంత్ అయితే, మరో సినిమాలో హీరో కమల్ గారు. అందువలన ఆ సినిమాలు వదులుకోలేక పోయాను. అందువలన నేను 'చంటి' సినిమాను చేయలేకపోయాను" అని అన్నారు. 

  • Loading...

More Telugu News