Beef: ఏపీలో 23 వేల కిలోల గోమాంసం పట్టివేత

beef caught in AP

  • అనకాపల్లి జిల్లా వేంపాడు టోల్ ప్లాజా వద్ద గోమాంసం పట్టివేత
  • కోల్ కతా నుంచి చెన్నైకు వెళుతున్న కంటైనర్ లో గోమాంసం
  • కంటైనర్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఏపీలో 23 వేల కిలోల గోమాంసం పట్టుబడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద గోమాంసం పట్టుబడింది. కోల్ కతా నుంచి చెన్నై వెళుతున్న కంటైనర్ ను పోలీసులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో గోమాంసం పట్టుబడింది. గోమాంసాన్ని అక్రమంగా తరలిస్తున్న కంటైనర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో గోమాంసాన్ని తరలిస్తున్న కంటైనర్ ను పోలీసులు పట్టుకోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News