Kiran Abbavaram: తండ్రి కాబోతున్న టాలీవుడ్ యంగ్ హీరో.. బేబీ బంప్‌తో ఉన్న భార్య ఫొటోను షేర్ చేసిన న‌టుడు

Kiran Abbavaram Shares Baby Bump Photo of His Wife

  • గ‌తేడాది ఆగ‌స్టులో పెళ్లి బంధంతో ఒక్క‌టైన‌ కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ర‌హ‌స్య గోర‌క్‌
  • మా ప్రేమ 2 అడుగుల మేర పెరుగుతోంది అంటూ భార్య బేబీ బంప్ ఫొటోను పంచుకున్న హీరో
  • ఇటీవ‌లే 'క' మూవీతో సూప‌ర్ హిట్‌ అందుకున్న కిర‌ణ్  
  • త్వ‌ర‌లోనే 'దిల్‌రూబా' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న యువ హీరో

టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం తండ్రి కాబోతున్నారు. త‌న భార్య ర‌హ‌స్య గోర‌క్‌ బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్న ఆయ‌న "మా ప్రేమ 2 అడుగుల మేర పెరుగుతోంది" అని ట్వీట్ చేశారు. దీంతో అంద‌రూ కిర‌ణ్ అబ్బ‌వ‌రం దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. 

కాగా, త‌న మొద‌టి చిత్రం 'రాజావారు రాణివారు'లో న‌టించిన హీరోయిన్ ర‌హ‌స్య‌ను కిర‌ణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. గతేడాది ఆగ‌స్టులో ఈ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. 

ఇక కిర‌ణ్ అబ్బ‌వ‌రం సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌లే 'క' మూవీతో సూప‌ర్ హిట్‌ అందుకున్నారు. త్వ‌ర‌లోనే 'దిల్‌రూబా' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. తాజాగా విడుద‌లైన ఈ చిత్రం టీజ‌ర్ ఆక‌ట్టుకుంటోంది. ఓ డిఫ‌రెంట్ ల‌వ్‌స్టోరీతో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్లు మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. 

అలాగే కిర‌ణ్ కెరీర్‌లో 'రాజావారు రాణివారు'తో పాటు 'ఎస్ఆర్ క‌ళ్యాణ మండ‌పం', 'విన‌రో భాగ్యం విష్ణు క‌థ‌', 'క' వంటి మంచి హిట్ చిత్రాలు ఉన్నాయి.  

More Telugu News