Dil Raju: టాలీవుడ్‌లో కలకలం.. దిల్‌రాజు ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు

IT Raids On Telangana FDC Chairman And Producer Dil Raju

   


‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా హిట్‌తో సంబరాలు చేసుకుంటున్న ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్ దిల్‌రాజుకు ఆదాయపన్నుశాఖ అధికారులు షాకిచ్చారు. ఈ ఉదయం ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలకు దిగారు. మొత్తం 55 బృందాలు రంగంలోకి దిగి ఏక కాలంలో 8 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నాయి. 

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని దిల్‌రాజు ఇళ్లతోపాటు ఆయన సోదరుడు శిరీశ్, కుమార్తె హన్సితారెడ్డి నివాసాల్లోనూ తనఖీలు కొనసాగుతున్నాయి. అంతేకాదు, ఆయన వ్యాపార భాగస్వాముల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహిస్తూ, అనుమానిత పత్రాలను తనఖీ చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News