knight frank: హైదరాబాదులో లగ్జరీ ఇళ్ల అమ్మకాల పెరుగుదల!

registration of properties in hyderabad up 7pc to 76613 units in 2024 knight frank

  • హైదరాబాద్‌లో లగ్జరీ ఇళ్లకు పెరుగుతున్న డిమాండ్
  • గృహ అమ్మకాల వృద్ధిని వివరించిన ప్రముఖ రియాల్టీ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్
  • మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త వెంచర్లు, ప్రాజెక్టులకు సన్నద్దం అవుతున్న రియల్ ఎస్టేట్ డెవలపర్లు

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ పరిధిలో నివాసాల (గృహాల)కు డిమాండ్ పెరుగుతోంది. గత రెండేళ్లలో ఇళ్ల విక్రయాలకు సంబంధించి వృద్ధిని ప్రముఖ రియాల్టీ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. 2023 ఏడాదితో పోలిస్తే గతేడాది ఇండ్ల విక్రయాలు ఏడు శాతం వృద్ధి చెందాయని ఆ సంస్థ పేర్కొంది. 2023 లో 71,912 గృహ అమ్మకాలు జరిగితే, 2024లో ఏడు శాతం పెరిగి 76,613 యూనిట్ల విక్రయాలు జరిగాయి. మొత్తం గృహ విక్రయాల విలువ 23 శాతం పెరిగింది.

2023లో 38,395 కోట్ల విలువైన గృహ విక్రయాలు జరగగా, 2024లో 47,173 కోట్లకు చేరుకున్నాయి. మొత్తం గృహ విక్రయాల్లో 90 శాతం రెసిడెన్షియల్ ప్రాంతాలదే ఆధిపత్యం. హైదరాబాద్ మార్కెట్ పరిధిలోకి హైదరాబాద్, మేడ్చల్ – మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు వస్తాయి. గత ఏడాది కాలంలో హైదరాబాద్ మార్కెట్ ప్రగతి దిశగా అడుగులు వేస్తోందని, సొంత గృహాల డిమాండ్ సుస్థిరంగా కొనసాగుతోందని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ శశిర్ బైజాల్ పేర్కొన్నారు. 

గృహాల కొనుగోలుదారుల ప్రాధాన్యతలో కూడా చెప్పుకోదగిన మార్పు కనిపిస్తోందని చెప్పారు. రూ.50 లక్షల లోపు గృహాల విక్రయాలు 60 శాతం ఉంటే, 2023లో అది 68 శాతంగా ఉందని తెలిపారు. ఇక రూ.50 లక్షల పైచిలుకు ధర గల గృహ రిజిస్ట్రేషన్లు 2023తో పోలిస్తే 2024లో 40 శాతానికి వృద్ధి చెందాయన్నారు. 2022తో పోలిస్తే 2023లో రూ.50 లక్షల పైచిలుకు గృహ విక్రయాలు 32 శాతం పుంజుకున్నాయని తెలిపారు. ఈ క్రమంలో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా రియల్ ఎస్టేట్ డెవలపర్లు కొత్త వెంచర్లు, ప్రాజెక్టులు ప్రారంభించేందుకు సన్నద్ధం అవుతున్నారు. 

  • Loading...

More Telugu News