Nandamuri balakrishna: 'అఖండ-2' లో మహా కుంభమేళా సీన్స్‌ ఎందుకో తెలుసా?

Do you know why the Maha Kumbh Mela scenes in Akhanda2

  • కృష్ణానది ప్రాంతంలో అఖండ-2 తాజా షెడ్యూల్‌ 
  • మహా కుంభమేళా సన్నివేశాలు చిత్రానికి హైలైట్‌ 
  • సెప్టెంబరు 25న విడుదల కానున్న 'అఖండ-2'

నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం 'అఖండ-2' తాండవం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇదే కాంబినేషన్‌లో తెరకెక్కిన గత చిత్రాలతో పాటు 'అఖండ' కూడా ఘన విజయం సాధించడమే ఇందుకు కారణం. 

అయితే ఈ చిత్రానికి సంబంధించిన కొన్నిసన్నివేశాలను గుడిమెట్ల కొండలు, కృష్ణానది పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాలని దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే బోయపాటి సోమవారం ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో పర్యటించాడు. అక్కడి లోకేషన్స్‌ను చూసి, అక్కడి స్థానికులతో మాట్లాడి, ఈ ప్రాంతం షూటింగ్‌కు అనువుగా ఉంటుందా అనే విషయాలను వారితో చర్చించాడు. 

అయితే ఇటీవల ఈ చిత్రం షూట్‌ ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఏర్పాటు చేశారు. సినిమాలో కీలకంగా వచ్చే సన్నివేశాలను ఈ మహా కుంభమేళాలో చిత్రీకరించిన సంగతి తెలిసిందే. చిత్రంలో ఈ మహాకుంభమేళా సన్నివేశాలు ఎంతో అద్భుతంగా ఉండబోతున్నాయని, ఈ చిత్రంలో పరమ శివ భక్తుడిగా, బాలకృష్ణ తొలి ఇంట్రడక్షన్‌ సీన్‌ కూడా ఇక్కడే ఉంటుందని తెలిసింది. 

ఈ సన్నివేశాలు కూడా ఎంతో దైవత్వంతో, అందరికి ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయని సమాచారం. 14 రీల్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంటలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని సమర్పకురాలిగా వ్యవహారిస్తున్నారు. అత్యంత భారీ వ్యయంతో, అత్యున్నత సాంకేతిక పరిజ్క్షానంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం సెప్టెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

  • Loading...

More Telugu News