IPS: ఏపీలో 27 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ... ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

ఏపీలో భారీ సంఖ్యలో ఐపీఎస్ అధికారులకు స్థాన చలనం కలిగింది. రాష్ట్రంలో ఒకేసారి 27 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. వీరిలో కొందరిని ప్రస్తుతం వారు ఉన్న పోస్టులోనే తిరిగి కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సీఎస్ పరిపాలనా ఉత్తర్వులు జారీ చేశారు.
1. అడిషనల్ డీజీపీ (గ్రేహౌండ్స్, ఆక్టోపస్) రాజీవ్ కుమార్ మీనాను రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ గా బదిలీ చేశారు.
2. ఎన్.మధుసూదనరెడ్డిని అడిషనల్ డీజీపీ (లా అండ్ ఆర్డర్)గా బదిలీ చేశారు.
3. లా అండ్ ఆర్డర్ ఐజీగా ఉన్న సీహెచ్.శ్రీకాంత్ ను ఐజీ (ఆపరేషన్స్)గా నియమించారు. అంతేకాదు, టెక్నికల్ సర్వీసెసస్ ఐజీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.
4. ఆర్.జయలక్ష్మిని ఏసీబీ ఐజీ/డైరెక్టర్ గా నియమించారు.
5. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఐజీ జి.పాలరాజును ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ గా నియమించారు.
6. ఏపీఎస్పీ బెటాలియన్ల ఐజీగా బి.రాజకుమారిని నియమించారు.
7. ప్రస్తుతం కాకినాడ ఎస్పీగా ఉన్న విక్రాంత్ పాటిల్ ను కర్నూలు జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు.
8. తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజును నియమించారు.
9. సీఐడీ ఎస్పీగా శ్రీధర్ ను నియమించారు.
10. సీఐడీ, ఎస్ సీఆర్ బీ ఎస్పీగా పరమేశ్వర్ రెడ్డిని నియమించారు.
11. ఎల్.సుబ్బరాయుడిని తిరుపతి ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా నియమించారు.
12. ఇంటెలిజెన్స్ డీఐజీ ఫకీరప్ప కాగినెల్లిని ఏపీఎస్పీ బెటాలియన్స్ డీఐజీగా బదిలీ చేశారు.
13. సత్యఏసుబాబును పీటీవో డీఐజీగా నియమించారు.
14. బాబూజీ అట్టాడను గ్రేహౌండ్స్ డీఐజీగా నియమించారు.
15. కాకినాడ జిల్లా ఎస్పీగా బిందుమాధవ్ ను నియమించారు.ఔ
16. ఏపీఎస్పీ 3వ బెటాలియన్ (కాకినాడ) కమాండెంట్ ఎం.దీపికను ఏపీఎస్పీ 2వ బెటాలియన్ (కర్నూలు) కమాండెంట్ గా బదిలీ చేశారు.
17. కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డిని మానవ హక్కులు-న్యాయపరమైన అంశాలు, సమన్వయం విభాగం ఎస్పీగా నియమించారు.
18. పి.పరమేశ్వర్ రెడ్డిని సీఐడీ, ఎస్ సీఆర్బీ ఎస్పీగా నియమించారు.
19. ఎస్.శ్రీధర్ ను సీఐడీ ఎస్పీగా నియామకం
20. ధీరజ్ కునుబిల్లిని అల్లూరి జిల్లా అదనపు ఎస్పీ (అడ్మినిస్ట్రేషన్)గా నియామకం
21. జగదీశ్ అడహళ్లిని అల్లూరి జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా బదిలీ
22. ఇంటెలిజెన్స్ ఎస్పీ జె.రామ్మోహన్ రావును తిరిగి అదే పోస్టులో కొనసాగింపు
23. సీఐడీ ఎస్పీ ఎన్.శ్రీదేవి రావును తిరిగి అదే పోస్టులో కొనసాగింపు
24. ఇంటెలిజెన్స్ ఎస్పీ ఇ.జి. అశోక్ కుమార్ ను కడప జిల్లా ఎస్పీగా బదిలీ
25. ఇంటెలిజెన్స్ ఎస్పీ ఏ.రమాదేవిని అదే పోస్టులో కొనసాగింపు
26. సీఐడీ ఎస్పీ కేజీవీ సరితను విజయవాడ డీసీపీ (అడ్మినిస్ట్రేషన్)గా బదిలీ
27. సీఐడీ ఎస్పీ కె.చక్రవర్తిని అదే పోస్టులో కొనసాగింపు

