Nara Rohit: మంచు మనోజ్ తో నా అనుబంధం మరింత పెరిగింది: నారా రోహిత్

- 'భైరవం' సినిమాలో నటించిన మనోజ్, రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్
- హైదరాబాద్ లో ఈరోజు జరిగిన టీజర్ లాంచింగ్ ఈవెంట్
- మనోజ్ తో తనకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉందన్న రోహిత్
మంచు మనోజ్ తో తనకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉందని నారా రోహిత్ అన్నారు. 'భైరవం' సినిమాతో ఆ అనుబంధం మరింత పెరిగిందని చెప్పారు. హైదరాబాద్ లో ఈరోజు 'భైరవం' మూవీ టీజర్ లాంచింగ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ నారా రోహిత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సినిమాలో మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్నారు. మనోజ్ కు జంటగా ఆనంది, బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఆదితి శంకర్, రోహిత్ కు జంటగా దివ్య పిళ్లై నటిస్తున్నారు. దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కించారు.