Bhairavam Teaser: ఆక‌ట్టుకుంటోన్న 'భైర‌వం' టీజ‌ర్

Bhairavam Official Teaser Out Now

  • మనోజ్, సాయి శ్రీనివాస్, నారా రోహిత్ హీరోలుగా 'భైర‌వం'
  • విజయ్ కనకమేడల దర్శకత్వం 
  • ముగ్గురు హీరోల ప‌క్క‌న క‌థానాయిక‌లుగా దివ్య పిళ్ళై, అదితి శంకర్, ఆనంది

టాలీవుడ్ యంగ్ హీరోలు మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ కీల‌క పాత్ర‌ల్లో విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నచిత్రం ‘భైరవం’. తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుద‌ల‌ చేశారు. టీజ‌ర్‌లో మనోజ్, రోహిత్, శ్రీనివాస్ ముగ్గురి హైవోల్టేజీ యాక్షన్ సీన్స్‌తో అద‌ర‌గొట్టారు. 

వారాహి గుడి, ఒక ఊరు నేపథ్యంలో యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందని టీజ‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది. ఇక ఈ ముగ్గురు హీరోల ప‌క్క‌న దివ్య పిళ్ళై, అదితి శంకర్, ఆనంది క‌థానాయిక‌లుగా న‌టించారు. అలాగే జయసుధ, ప్రియమ‌ణి కీలక పాత్రలో క‌నిపించ‌నున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. 

More Telugu News