Chandrababu: స్విట్జర్లాండ్ లో భారత రాయబారితో సీఎం చంద్రబాబు భేటీ

- దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు
- తరలి వెళ్లిన చంద్రబాబు టీమ్
- జ్యూరిచ్ ఎయిర్ పోర్టు నుంచి హిల్టన్ హోటల్ కు వెళ్లిన ఏపీ బృందం
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, ఉన్నతాధికారులు తరలి వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా, జ్యూరిచ్ చేరుకున్న చంద్రబాబు ఎయిర్ పోర్టు నుంచి హిల్టన్ హోటల్ కు వెళ్లారు. స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృదుల్ కుమార్ తో భేటీ అయ్యారు. ఆయనతో పలు అంశాలపై చర్చించారు.
అనంతరం, పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వారికి వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉందని వారికి తెలియజేశారు.