Telangana: తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాపై కంపెనీ కీలక ప్రకటన

UBL to resume the supply of Kingfisher Beer in Telangana with immediate effect

  • తెలంగాణలో బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు యూబీ ప్రకటన
  • ధరల పెంపు, బకాయిలపై ప్రభుత్వంతో చర్చలు
  • తెలంగాణ బేవరేజెస్ కార్పోరేషన్ నుంచి సానుకూల ప్రకటన వచ్చిందన్న సంస్థ

తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాపై యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. ఈ అంశంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. ధరల పెంపు, బకాయిల చెల్లింపులపై తెలంగాణ బేవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్‌తో చర్చలు జరిగిన తర్వాత సంస్థ నుంచి ఈ ప్రకటన వచ్చింది. సమస్యలను పరిష్కరిస్తామని తెలంగాణ బీవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్ హామీ ఇచ్చింది.

ప్రభుత్వం నుంచి హామీ రావడంతో బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ తెలిపింది. వినియోగదారులు, కార్మికుల వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా మధ్యంతర నిర్ణయం తీసుకున్నామన్నారు. సెబీ రెగ్యులేషన్స్‌కి అనుగుణంగా తెలంగాణ బీవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్‌కి బీర్ల సరఫరాను తక్షణమే అమల్లోకి తీసుకు వస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

  • Loading...

More Telugu News