islands: ఇండియాలో ఇన్ని దీవులు ఉన్నాయా?... ఈ ఐలాండ్స్​ చూశారా?

do you know how many islands in india

  • దీవులు అనగానే మనకు గుర్తొచ్చేది విదేశాలే...
  • ఆకట్టుకునే బీచ్ లతో, అందమైన ప్రకృతితో పర్యాటకంగా అవి ఫేమస్
  • మన దేశంలోనూ వేల కొద్దీ దీవులు ఉన్నాయి తెలుసా?

మనకు దీవులు అనగానే విదేశాలు, విదేశాల్లోని ఐలాండ్స్ గుర్తొస్తుంటాయి. చాలా మంది మాల్దీవులు, మరో దేశం అంటూ దీవుల్లో పర్యటించేందుకు వెళుతూ ఉంటారు. మరి మన దేశంలోనూ పెద్ద సంఖ్యలో దీవులు ఉన్నాయి తెలుసా? ఈ మధ్య ఫేమస్ అయిన లక్ష దీవుల గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది. కానీ తెలియని దీవులు మరెన్నో ఉన్నాయి.

మూడు సముద్ర ప్రాంతాల్లో కలిపి...
మన దేశం చుట్టూ ఆవరించి ఉన్న బంగాళాఖాతం, హిందూ మహా సముద్రం, అరేబియా సముద్ర ప్రాంతాల్లో కలిపి... మన దేశానికి మొత్తం 1,382 దీవులు ఉన్నాయి. ఇవన్నీ ఓ మోస్తరు పరిమాణంలో ఉన్నవే. బాగా చిన్నగా ఉండే దీవులు మరెన్నో ఉన్నాయి. ముఖ్యంగా అరేబియా సముద్రంలోని లక్ష దీవులు, బంగాళాఖాతంలోని అండమాన్–నికోబార్ దీవులు పేరెన్నికగన్నాయి.

అటు ప్రకృతి... ఇటు సౌకర్యం
అండమాన్ నికోబార్ దీవులు విభిన్న పర్యావరణ వ్యవస్థలకు, ప్రకృతి సౌందర్యానికి నిలయం. ఈ గ్రూప్ లో 572 దీవులు ఉన్నాయి. అందులో  38 దీవుల్లో మాత్రమే మనుషుల సంచారం ఉంది. మరికొన్నింటిలో పురాతన ఆదిమ జాతి వాళ్లు నివసిస్తున్నారు. మిగతావన్నీ మానవ సంచారం ఏ మాత్రం లేనివే. అండమాన్, నికోబార్ దీవుల్లో కొన్నింటిలో మాత్రమే సరిపడా సదుపాయాలు ఉన్నాయి.
మరోవైపు లక్షదీవులు పగడపు దిబ్బలు, అద్భుతమైన బీచ్ లు, సముద్ర వింతలకు నెలవు. వీటిలో పర్యాటకులకు అవసరమైన సదుపాయాలు ఎన్నో ఉన్నాయి. ఇది మొత్తంగా 36 దీవుల సముదాయం. 

సముద్ర తీరం వెంట దీవులతో...
భారత దేశానికి ఉన్న సముద్ర తీరం పొడవునా భూభాగానికి సమీపంలో పెద్ద సంఖ్యలో దీవులు ఉన్నాయి. అందులో చాలా వరకు పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందాయి. పశ్చిమాన గుజరాత్ నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వరకు రాష్ట్రాల తీరం వెంట పదుల కొద్దీ దీవులు ఉన్నాయి. ఇవి కాకుండా నదుల మధ్య, భారీ నీటి వనరుల మధ్య ఉన్న దీవులు అదనం.

  • Loading...

More Telugu News