Vijay Ranga Raju: సినీ నటుడు విజయ్ రంగరాజు కన్నుమూత

Actor Vijay Ranga Raju passes away

  • చెన్నైలోని ఆసుపత్రిలో గుండెపోటుతో కన్నుమూసిన విజయ్ రంగరాజు
  • పూణెలో పుట్టి ముంబైలో పెరిగిన రంగరాజు
  • 5 వేలకు పైగా చిత్రాల్లో నటించిన రంగరాజు

టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు విజయ్ రంగరాజు కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. వారం క్రితం హైదరాబాద్ లో ఒక సినిమా షూటింగ్ లో ఆయన గాయపడ్డారు. దీంతో చికిత్స కోసం ఆయన చెన్నైకి వెళ్లారు. అక్కడ చికిత్స తీసుకుంటూ గుండెపోటుకు గురై కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు.

విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఫైటర్ గా ఆయన 5 వేలకు పైగా సినిమాల్లో నటించారు. బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ 'భైరవద్వీపం' ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. విజయ్ రంగరాజు పుట్టింది పూణెలో. పెరిగింది ముంబైలో. బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, రంగరాజు ఒకే స్కూల్ లో చదువుకున్నారు. ఆ తర్వాత రంగరాజు గుంటూరులో విద్యాభ్యాసం పూర్తి చేశారు.

  • Loading...

More Telugu News