Saif Ali Khan: సైఫ్ నటుడు అని తెలియదన్న నిందితుడు

Accused said in statement that he was unaware of Saif Ali Khan

  • తన నివాసంలో కత్తిపోట్లకు గురైన నటుడు సైఫ్ అలీ ఖాన్
  • నిందితుడ్ని థానేలో అరెస్ట్ చేసిన పోలీసులు
  • విచారణలో కీలక అంశాలు వెల్లడించిన నిందితుడు

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసిన నిందితుడ్ని ముంబయి పోలీసులు థానేలో అరెస్ట్ చేయడం తెలిసిందే. అతడి పేరు షరిఫుల్ ఇస్లామ్ షేజాద్. అతడ్ని ఓ బంగ్లాదేశీ జాతీయుడిగా గుర్తించారు. కాగా, తన స్టేట్ మెంట్ లో ఆ వ్యక్తి ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. 

తాను చొరబడింది ఓ సెలబ్రిటీ ఇల్లు అని, తాను దాడి చేసింది ఓ నటుడిపై అని తనకు తెలియదన్నాడు. ఎవరో మామూలు వ్యక్తి అనుకునే ఆ ఇంట్లో ప్రవేశించానని తెలిపాడు. దాడి తర్వాత టీవీల్లో వార్తలు చూసి థానేకు పారిపోయానని వివరించాడు. 

తన ఫోన్ స్విచాఫ్ చేసి, అక్కడే ఉన్న ఓ లేబర్ క్యాంపులో తలదాచుకున్నానని తెలిపాడు. సైఫ్ అలీ ఖాన్ ఇంటి వెనుకభాగంలోని మెట్ల మీదుగా వచ్చి, ఏసీ పైపు ద్వారా లోపలికి చేరుకున్నానని నిందితుడు విచారణలో వెల్లడించాడు. .

  • Loading...

More Telugu News