K Kavitha: రాజకీయం కోసమే పసుపు బోర్డును ప్రకటించారు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

BRS MLC Kavitha fires at BJP

  • ఇందూరులో పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామన్న కవిత
  • రాజకీయ కోణంలోనే బీజేపీ ప్రకటన చేసిందన్న ఎమ్మెల్సీ
  • ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని విమర్శ

రాజకీయం కోసమే పసుపు బోర్డును ప్రకటించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఇందూరులో పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామని, కానీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.

హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ... పసుపు బోర్డు ఏర్పాటుపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. దీనిని రాజకీయ కోణంలోనే ప్రకటన చేశారన్నారు. నిజంగా రైతుల కోసమే ఈ నిర్ణయమైతే పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలన్నారు.

ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారన్నారు. పసుపు బోర్డు కోసం బీఆర్ఎస్ పార్టీయే పోరాటం చేసిందన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడే పసుపు బోర్డు కోసం కృషి చేశానన్నారు. నిజామాబాద్‌కు విమానాశ్రయం తీసుకురావాల్సిన బాధ్యత ఎంపీ అర్వింద్‌పై ఉందన్నారు.

  • Loading...

More Telugu News