Balakrishna: తాను ఇంత ఫిట్‌గా ఉండ‌టానికి ఏ ఫుడ్ తింటారో చెప్పిన బాల‌య్య‌

Balakrishna About Production Food

  • ప్రొడ‌క్ష‌న్ ఫుడ్ తిని ఇంత ఫిట్‌గా ఉన్నాన‌న్న బాల‌కృష్ణ‌
  • షూటింగ్ స‌మ‌యంలో ప్రొడ‌క్ష‌న్ ఫుడ్ మాత్ర‌మే తింటాన‌ని వెల్ల‌డి
  • ఈ విష‌యంలో భార్య వ‌సుంధ‌ర త‌న‌ను తిట్టినా స‌రే.. తాను మాత్రం త‌గ్గ‌న‌న్న బాల‌య్య

తాను ఇంత ఫిట్‌గా ఉండేందుకు ప్ర‌త్యేక ర‌హ‌స్యం ఏమీ లేద‌ని బాల‌కృష్ణ చెప్పారు. షూటింగ్ స‌మ‌యంలో ప్రొడ‌క్ష‌న్ ఫుడ్ మాత్ర‌మే తింటాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. డాకు మ‌హారాజ్ ప్ర‌మోష‌న్ ఈవెంట్‌లో ఆయ‌న మాట్లాడుతూ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. 

త‌న ఇంటి స‌మీపంలో షూటింగ్ జ‌రుగుతున్నా స‌రే.. తాను మాత్రం ప్రొడ‌క్ష‌న్ ఫుడ్డే తింటాన‌ని తెలిపారు. ఈ విష‌యంలో భార్య వ‌సుంధ‌ర త‌న‌ను తిడుతుంద‌ని, అయినా తాను మాత్రం త‌గ్గ‌న‌ని చెప్పుకొచ్చారు. ఇవాళ తాను ఇంత హుషారుగా, ఫిట్‌గా ఉన్నానంటే ఇండ‌స్ట్రీ ఫుడ్ తిన‌డమేన‌ని తెలిపారు. ఇప్పుడీ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌గా.. బాల‌య్య అభిమానులు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. 

More Telugu News