HDFC Bank: మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాదారులా... అయితే ఇది మీ కోసమే!

ప్రైవేటు రంగ బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ తమ ఖాతాదారులను అప్రమత్తం చేసింది. బ్యాంకింగ్ సిస్టమ్ మెయింటెనెన్స్ నేపథ్యంలో 16 గంటలపాటు సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నట్టు తెలిపింది. కాబట్టి ఏవైనా అత్యవసర సేవలు పొందాలనుకున్న వారు ఈ లోపే వాటిని పొందాలని కోరింది.
ఈ నెల 24వ తేదీ రాత్రి పది గంటల నుండి 25 వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల వరకు చాట్ బ్యాంకింగ్, ఎస్సెమ్మెస్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, ఐవీఆర్ సేవలు అందుబాటులో ఉండవని బ్యాంకు తెలిపింది. అలాగే, కరెంటు ఖాతాలు, సేవింగ్ ఖాతాలు, రూపే క్రెడిట్ కార్డ్, మొబైల్ బ్యాంకింగ్‌తో పాటు యూపీఐ సేవలపైనా ఈ ప్రభావం ఉంటుందని, ఖాతాదారులు సహకరించాలని కోరింది. బ్యాంకు సేవల అంతరాయానికి సంబంధించిన సమాచారాన్ని ఖాతాదారులకు ఇప్పటికే తెలియజేసినట్టు పేర్కొంది.