Atchannaidu: నా జీవితం టీడీపీ, చంద్రబాబుకు అంకితం: అచ్చెన్నాయుడు

Atchannaidu praises NTR

  • ఎన్టీఆర్ అంచెలంచెలుగా ఎదిగారన్న అచ్చెన్న
  • ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్ దని కితాబు
  • టీడీపీ తన ప్రాణం అని వ్యాఖ్య

సామాన్య కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ అంచెలంచెలుగా ఎదిగారని అచ్చెన్నాయుడు అన్నారు. సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా ఎదిగారని చెప్పారు. టీడీపీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారని... బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించిన వ్యక్తి అని కొనియాడారు. 

తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను తొలగించింది ఎన్టీఆర్ అని అచ్చెన్న తెలిపారు. మన దేశంలో సంక్షేమం అనే పదం పుట్టింది ఎన్టీఆర్ నోటి నుంచేనని చెప్పారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్ ది అని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాల ప్రకారం చంద్రబాబు పార్టీని నడిపిస్తున్నారని చెప్పారు. తన ప్రాణం తెలుగుదేశం పార్టీ అని... టీడీపీకి, చంద్రబాబుకి తన జీవితం అంకితమని అన్నారు. 

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అచ్చెన్నాయుడు, అనిత, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News