Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేశ్ నుంచి మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్!

- 2022లో వచ్చిన 'సుడల్' సిరీస్
- 8 ఎపిసోడ్స్ గా అలరించిన కథ
- ఫిబ్రవరి 21 నుంచి సీజన్ 2 అంటూ టాక్
- ఐశ్వర్య రాజేశ్ ఫ్యాన్స్ వెయిటింగ్
ఐశ్వర్య రాజేశ్... ఒక వైపున సినిమాలతో, మరో వైపున వెబ్ సిరీస్ లతో ఇప్పుడు ఫుల్ బిజీ. కోలీవుడ్ లో నాయిక ప్రధానమైన కథలు అనగానే, నయనతార-త్రిష తరువాత కనిపించే పేరు ఆమెదే. ఐశ్వర్య రాజేశ్ చేసిన వెబ్ సిరీస్ లకు కూడా విశేషమైన ఆదరణ లభిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో ఆమె చేసిన 'సుడల్' (Suzhal: The Vortex)ను ప్రేక్షకులు ఇంకా మరిచిపోలేదు. ఆ సిరీస్ లో ఆమె యాక్టింగును మరిచిపోలేదు.
2022లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ కి విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. బ్రహ్మ-అనుచరణ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 8 ఎపిసోడ్స్ గా పేక్షకులను పలకరించింది. కథిర్, గౌరీ కిషన్, మంజిమా మోహన్, హరీశ్ ఉత్తమన్ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. అదే కాంబినేషన్లో ఇప్పుడు ఆ సిరీస్ నుంచి సీజన్ 2 రావడానికి రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 21 నుంచి అమెజాన్ ప్రైమ్ లో సీజన్ 2 స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు.
సీజన్ వన్ కథ విషయానికి వస్తే... ఒక సిమెంటు ఫ్యాక్టరీ అగ్నిప్రమాదంలో పూర్తిగా దెబ్బ తింటుంది. ఫ్యాక్టరీలో యూనియన్ నాయకుడిగా ఉన్న 'షణ్ముగం' అందుకు కారకుడని అంతా అనుకుంటారు. అదే సమయంలో అతని చిన్నకూతురు 'నీల', తాను ప్రేమించిన వ్యక్తితో పాటు శవమై చెరువులో తేలుతుంది. అది ఆత్మహత్య కాదని గ్రహించిన నీల అక్కయ్య ( ఐశ్వర్య రాజేశ్) ఏం చేస్తుందనేది కథ. ఇక సెకండ్ సీజన్ ఎక్కడి నుంచి మొదలవుతుందనేది చూడాలి.