Sanjay Roy: ఈ కేసులో నన్ను ఇరికించారు: ఆర్జీ కర్ హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్

Found Guilty Of Raping And Murdering Kolkata RG Kar Doctor

  • సంజయ్ రాయ్‌ని దోషిగా తేల్చిన సీల్దా కోర్టు
  • తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని కోర్టుకు తెలిపిన సంజయ్ రాయ్
  • హత్యాచారం చేసిన వారిని వదిలేస్తున్నారని వ్యాఖ్య

ఈ కేసులో తనను తప్పుగా ఇరికించారని కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ విద్యార్థిని హత్యాచార కేసు నిందితుడు సంజయ్ రాయ్ కోర్టుకు తెలిపాడు. తాను ఎలాంటి నేరం చేయలేదన్నాడు. కోల్‌కతాలోని సీల్దా కోర్టు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్‌ని ఇవాళ దోషిగా తేల్చింది. ఈ నెల 20న అతనికి శిక్షను ఖరారు చేయనుంది.

కోర్టులో ప్రవేశపెట్టిన నిందితుడిని ఉద్దేశించి, నీకు శిక్ష పడాలని న్యాయమూర్తి అన్నారు. ఈ సమయంలో, తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని సంజయ్ రాయ్ కోర్టుకు తెలిపాడు. నేరానికి పాల్పడిన వారిని విచారించలేదని ఆరోపించాడు. తనను తప్పుగా ఇరికించారని, ఎలాంటి తప్పూ చేయలేదన్నాడు. హత్యాచారం చేసిన వారిని వదిలేస్తున్నారని, ఇందులో ఓ ఐపీఎస్ కూడా ఉన్నాడని కోర్టుకు తెలిపాడు.

  • Loading...

More Telugu News