Bhagya Raja: తెలుగు అమ్మాయినే ప్రేమించాను... కానీ కాపాడుకోలేకపోయాను: దర్శకుడు భాగ్యరాజా!

K Bhagya Raja Interview

  • నటుడిగా... దర్శకుడిగా భాగ్యరాజాకి పేరు 
  • ప్రవీణతో ప్రేమ గురించి ప్రస్తావన 
  • తమకి సంతానం కలగలేదని వెల్లడి 
  • అలా ఆమె చనిపోయిందని ఆవేదన


భాగ్యరాజా పేరు వినగానే తమిళంలో ఆయన నటించిన అనేక చిత్రాలు కనులముందు కదలాడతాయి. 1980 నుంచి 2010 వరకూ కూడా ఆయన చాలా యాక్టివ్ గా ఉంటూ వచ్చారు. దర్శక నిర్మాతగా... సినీ రచయితగా కూడా ఆయనకి మంచి గుర్తింపు ఉంది. అప్పట్లోనే తన సినిమాల అనువాదాల కారణంగా తెలుగులోను అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి భాగ్యరాజా. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

"నేను సినిమాలలో ప్రయత్నాలు చేస్తున్నాను. ఆ సమయంలోనే తమిళ ఇండస్ట్రీకి 'గుంటూరు' నుంచి ప్రవీణ వచ్చింది. సినిమాలలో ఆర్టిస్టుగా తన ప్రయత్నాలు తాను చేయడం మొదలుపెట్టింది. నాతో ఉన్న కాస్త పరిచయం కారణంగా తమిళం నేర్పమని నన్ను అడిగింది. మా ఇద్దరిలో ఎవరు సక్సెస్ అయినా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఎవరి ప్రయత్నాలలో వారు బిజీ అయ్యాము. ఆమె కంటే ముందుగా నేను సక్సెస్ అయ్యాను" అని అన్నారు. 

"ప్రవీణ ఇంకా చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉండగానే, నాకు మంచి పేరు వచ్చింది. ముందుగా అనుకున్న మాట మేరకు ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నట్టు చెప్పాను. అప్పుడు ఆమె చాలా ఏడ్చింది... ఇద్దరం 'తిరుపతి'లో పెళ్లి చేసుకున్నాము. మూడు నాలుగేళ్లు అయినా మాకు పిల్లలు కలగలేదు. అందుకు సంబంధించిన ఒక ఆపరేషన్ కూడా తనకి జరిగింది. ఆ సమయంలో జరిగిన ఒక పొరపాటు కారణంగా జాండీస్ రావడంతో ఆమె చనిపోయింది" అని చెప్పారు. 

  • Loading...

More Telugu News