Manchu Vishnu: మ‌నోజ్‌తో వివాదంపై ప్ర‌శ్న‌.. విష్ణు స‌మాధానం ఇదే..!

Manchu Vishnu About Issues With Manch Manoj

  • గ‌త కొన్నిరోజులుగా  తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మంచు కుటుంబ‌ గొడ‌వ‌లు
  • ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో పోస్టుల‌తో హీట్ ఎక్కిస్తున్న మంచు బ్ర‌ద‌ర్స్‌ 
  • ఈ క్ర‌మంలో మంచు ఫ్యామిలీ వివాదంపై తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో విష్ణుకు ప్ర‌శ్న
  • ఆ వివాదం గురించి తానేమీ మాట్లాడ‌ద‌ల‌చుకోలేదంటూ దాట‌వేసిన వైనం

గ‌త కొన్నిరోజులుగా మంచు కుటుంబ‌ గొడ‌వ‌లు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే. తండ్రీకొడుకుల మ‌ధ్య ర‌చ్చ‌కెక్కిన‌ వైరంతో ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకునే వ‌ర‌కు వెళ్లింది. ఇక హైద‌రాబాద్‌లోని జ‌ల్‌ప‌ల్లిలోని మోహ‌న్ బాబు నివాసం వ‌ద్ద జ‌రిగిన రాద్ధాంతం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మోహ‌న్ బాబు ఏకంగా మీడియా వ్య‌క్తిపైనే దాడికి పాల్ప‌డ‌డంతో ఆయ‌న‌పై కేసులు న‌మోద‌య్యాయి.  

ప్ర‌స్తుతం మంచు కుటుంబం సోష‌ల్ మీడియా వేదిక‌గా మాట‌ల యుద్ధం మొద‌లు పెట్టింది. సామాజిక మాధ్య‌మాల్లో మంచు విష్ణు, మంచు మ‌నోజ్ వ‌రుస పోస్టుల‌తో హీట్ ఎక్కిస్తున్నారు. ఈ క్ర‌మంలో మంచు ఫ్యామిలీ వివాదంపై తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో విష్ణుకు ప్ర‌శ్న ఎదురైంది. ఆయ‌న డ్రీమ్ ప్రాజెక్టు 'క‌న్న‌ప్ప' ప్రమోష‌న్స్‌లో భాగంగా విష్ణు ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. 

అందులో ఆయ‌న‌కు మంచు ''మ‌నోజ్ దేనికోసం పోరాటం చేస్తున్నారు?" అనే ప్ర‌శ్న అడిగారు. ఈ ప్ర‌శ్న‌పై విష్ణు త‌న‌దైన‌శైలిలో స్పందించారు. "నేను నా మూవీ క‌న్న‌ప్ప ప్ర‌మోష‌న్ కోసం ఇక్క‌డికి వ‌చ్చాను. మీరు దాని గురించి అడ‌గండి. ఆ వివాదం గురించి నేను ఏమీ మాట్లాడ‌ద‌ల‌చుకోలేదు. అయినా.. మ‌న చ‌ర్య‌లే మ‌న వైఖ‌రి ఏంటో తెలియ‌జేస్తాయి. జ‌న‌రేట‌ర్‌లో పంచాదార, ఉప్పు పోస్తే.. అవి ఫిల్ట‌ర్‌ ప్రాసెసింగ్‌లోనే ఆగిపోతాయి. కానీ, జ‌న‌రేట‌ర్ పేల‌దు" అని స‌మాధానం చెప్పారు.  

  • Loading...

More Telugu News