Konda Surekha: ఉప ఎన్నికలు వస్తాయన్న కేటీఆర్ వ్యాఖ్యలపై కొండా సురేఖ ఆగ్రహం

Konda Surekha fires at KTR over bypoll comments

  • బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏం చేశారని నిలదీత
  • బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శ
  • రైతు రుణమాఫీ విషయంలో ప్రజల్లో అనుమానాలు సృష్టిస్తున్నారని మండిపాటు

ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడటం విడ్డూరమని, ఉప ఎన్నికలు రావడానికి తమ ప్రభుత్వం మైనార్టీలో లేదని తెలంగాణ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉందని, ఆ కాలంలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు.

రైతు రుణమాఫీ విషయంలో ప్రజల్లో లేనిపోని అనుమానాలను సృష్టిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేత అని, ఆయన ప్రజల తరఫున పోరాటం చేయాలని, కానీ ఇప్పటికీ బయటకు రావడం లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో అన్ని హామీలు అమలు చేశామని వారు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కానీ తాము అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే, తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసిందన్నారు.

  • Loading...

More Telugu News