Manchu Manoj: కూర్చొని మాట్లాడుకుందాం.. నేను ఒంటరిగానే వస్తా: మంచు మనోజ్ పోస్ట్ వైరల్

- కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మంచు ఫ్యామిలీ గొడవలు
- సోషల్ మీడియా వేదికగా మంచు విష్ణు, మంచు మనోజ్ వరుస పోస్టులు
- తాజాగా మనోజ్ 'ఎక్స్' వేదికగా మరో ఆసక్తికర పోస్ట్
- అయితే, ఈ పోస్టు ఎవరిని ఉద్దేశించి పెట్టారనేది మాత్రం డైరెక్ట్‌గా ఎక్కడా చెప్పని మనోజ్
గత కొన్నిరోజులుగా మంచు ఫ్యామిలీ గొడవలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. తండ్రీకొడుకుల మధ్య వైరం రచ్చకెక్కింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఇప్పుడు మాటల యుద్ధం మొదలైంది. సోషల్ మీడియా వేదికగా మంచు విష్ణు, మంచు మనోజ్ వరుస పోస్టులతో హీట్ ఎక్కిస్తున్నారు.
తాజాగా మనోజ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా మరో ఆసక్తికర పోస్ట్ చేశారు. కూర్చొని మాట్లాడుకుందామని, తాను సింగిల్‌గానే వస్తానని అందులో పేర్కొన్నారు. అయితే, ఆయన ఈ పోస్టు ఎవరిని ఉద్దేశించి పెట్టారనేది మాత్రం మనోజ్ డైరెక్ట్‌గా ఎక్కడా చెప్పలేదు.
"కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. నాన్న, ఇంట్లోని మహిళలు, ఉద్యోగులు, మిగిలిన వాళ్లను పక్కనపెట్టి మనమే సామరస్యపూర్వకంగా చర్చించుకుందాం. ఏమంటావ్. నేను ఒంటిరిగానే వస్తానని మాటిస్తున్నా. నీకు నచ్చిన వాళ్లను నీవు తీసుకురావచ్చు. లేదంటే మనమే ఆరోగ్యకరమైన చర్చ పెట్టుకుందాం. నీ కరెంట్‌తీగ" అని మనోజ్ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియా వైరల్ అవుతోంది.