Tollywood: సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని పిలిచి... అత్యాచారం చేశాడు!

Sexual assault on women in Tollywood

  • హైదరాబాద్ కృష్ణానగర్ లో ఘటన
  • మహిళపై అత్యాచారం చేసిన డైరెక్షన్ విభాగంలో పని చేస్తున్న వ్యక్తి
  • జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని పిలిచి ఓ మహిళపై ఒక వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే మణికొండలో హౌస్ కీపింగ్ పని చేసే ఒక వివాహిత విభేదాల కారణంగా భర్తతో విడిపోయింది. సినిమాల్లో నటిస్తే ఆర్థికంగా స్థిరపడవచ్చని ఆమె భావించింది. 15 రోజుల క్రితం అమీర్ పేటలోని ఓ హాస్టల్ లో చేరి, జూనియర్ ఆర్టిస్టు అవకాశం కోసం కృష్ణానగర్, ఇందిరానగర్ ప్రాంతాల్లో తిరుగుతోంది. ఈ క్రమంలో ఆమెకు టాలీవుడ్ డైరెక్షన్ విభాగంలో పని చేస్తున్న కాటేకొండ రాజుతో పరిచయం ఏర్పడింది. 

మూడు రోజుల క్రితం ఆడిషన్స్ జరుగుతున్నాయంటూ కృష్ణానగర్ లోని హెవెన్ హోటల్ కు ఆమెను పిలిచాడు. తొలిరోజు ఫొటో షూట్ చేశాడు. మరుసటి రోజు రావాలని చెప్పాడు. రెండో రోజు హోటల్ గదికి వెళ్లగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది, బీఎన్ఎస్ 64, 79, 115, 351 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


  • Loading...

More Telugu News