Cock Fight: రూ. లక్ష పలికిన చనిపోయిన పందెం కోడి!

 One Lakh For Dead Cock Who Fought Unsuccesfully

   


సాధారణంగా పందెం కోడికి లక్షలు వెచ్చించడం వినే ఉంటాం. కానీ, పందెంలో చనిపోయిన కోడికి వేలంలో లక్ష రూపాయల ధర పలికింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఓడిపోయినా దాని పోరాట పటిమను చూసిన పలువురు దానిని దక్కించుకునేందుకు పోటీపడ్డారు. చివరికి ఓ వ్యక్తి దానిని లక్ష రూపాయలకు దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. 

ఏలూరుకు చెందిన రాజేంద్ర, ఆహ్లాద్, రాజవంశీ కలిసి పందెం కోసం కోడిపుంజును పెంచారు. గురువారం జరిగిన కోడిపందెంలో అది తుదికంటా పోరాడి ఓడిపోయింది. దీంతో వారు ఈ పుంజును కాల్చి వేలానికి పెట్టారు. ఏలూరు రూరల్‌ మండలంలోని జాలిపూడికి చెందిన మాగంటి నవీన్ చంద్రబోస్ రూ. 1,11,111కు దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. 

  • Loading...

More Telugu News