Konda Surekha: బాలుడ్ని బైక్‌తో ఢీకొట్టి దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్... కమిషనర్‌కు ఫోన్ చేసిన మంత్రి సురేఖ

- హన్మకొండలో బాలుడిని బైక్‌తో ఢీకొట్టిన కానిస్టేబుల్
- స్థానికులు ప్రశ్నించడంతో కేసు పెట్టుకోవాలంటూ దురుసు ప్రవర్తన
- విషయం తెలిసి, వరంగల్ కమిషనర్‌కు ఫోన్ చేసిన మంత్రి
- కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలంటూ కొండా సురేఖ ఆదేశాలు
ప్రమాదానికి కారణం కావడంతో పాటు కేసు పెట్టుకోవాలంటూ దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలంటూ మంత్రి కొండా సురేఖ ఈరోజు వరంగల్ పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి ఆదేశించారు. హన్మకొండలోని కుమార్‌పల్లిలో ఓ బాలుడు రోడ్డును దాటుతుండగా ఓ కానిస్టేబుల్ ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. బాలుడు ప్రమాదానికి గురయ్యాడు. స్థానికులు కానిస్టేబుల్‌ను ప్రశ్నించారు.
అయితే, కావాలని చేయలేదని, కావాలంటే కేసు పెట్టుకోవాలంటూ ఆ కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించాడని స్థానికులు ఆరోపించారు. ఈ విషయం మంత్రి కొండా సురేఖ వద్దకు వెళ్లింది. కానిస్టేబుల్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వం లేకుండా దురుసుగా ప్రవర్తించడంపై మండిపడ్డారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝాకు ఫోన్ చేసి కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాలుడికి మెరుగైన చికిత్సను అందించాలన్నారు.