Tabu: మగాడి తోడు లేకున్నా బాగానే ఉన్నా: టబు

- పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్న టబు
- పెళ్లి అవసరం ఏముందని ప్రశ్న
- జీవితంలో మగాడి అవసరం లేదని వ్యాఖ్య
హైదరాబాదీ బ్యూటీ టబు బాలీవుడ్ లో వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. విభిన్నమైన క్యారెక్టర్లను పోషిస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. 53 ఏళ్ల వయసు వచ్చినా తరగని అందం ఆమెది. మరోవైపు పెళ్లి చేసుకోకుండా టబు ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఆమె స్పందిస్తూ... తనకు పెళ్లి అవసరం ఏముందని టబు ప్రశ్నించారు. మగాడి తోడు లేకుండా బాగానే ఉన్నానని చెప్పారు. మగాడి అవసరం పడక గదిలో అవసరమొస్తుంది కానీ... జీవితంలో కాదని అన్నారు. ఆమె చేసిన బోల్డ్ కామెంట్స్ పై కొందరు పాజిటివ్ గా స్పందిస్తే... మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు.