Manchu Manoj: కన్నప్పలో కృష్ణంరాజులా అవ్వాలని ప్రతి కుక్కకు ఉంటుంది: కుటుంబ వివాదం వేళ మంచు మనోజ్ ట్వీట్

Manchu Manoj tweet on Manchu Vishnu

  • కృష్ణంరాజులా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకు ఉంటుందని ట్వీట్
  • ఈ విషయం ఇదే జన్మలో తెలుసుకుంటావని ట్వీట్
  • కృష్ణంరాజు సినిమాకు సంబంధించిన పోస్టర్లను జత చేసిన మనోజ్

ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. మంచు విష్ణు ట్వీట్ తర్వాత మంచు మనోజ్ కూడా ఓ ట్వీట్ చేశారు. ఇది టాలీవుడ్‌లో ఆసక్తిని రేపుతోంది. "కన్నప్పలో రెబెల్ స్టార్ కృష్ణంరాజులా సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకు ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్" అంటూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌కు కృష్ణంరాజుకు సంబంధించిన సర్దార్ పాపారాయుడు, భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మనాయుడు సినిమా పోస్టర్లను పొందుపరిచారు. అంతకుముందు విష్ణు ట్వీట్ నేపథ్యంలో ఆ తర్వాత మనోజ్ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఆ తర్వాత తన తండ్రి మోహన్ బాబు నటించిన ఓ సినిమాలోని ఓ క్లిప్పింగ్‌ను పోస్ట్ చేశారు. 'బలవంతంగా తన్ని, కొట్టి, చంపుతానని బెదిరించి నేను తెచ్చి ఇచ్చిన దస్తావేజులు నాకు కావాలి సామి... నా ఆలి చెప్పింది కాబట్టి గొడవలు మాని చేసిన పాపం కడిగేసుకుందామని వచ్చాను' అంటూ మోహన్ బాబు నటించిన సినిమా వీడియో క్లిప్పింగ్‌ను పోస్ట్ చేశారు.

మంచు విష్ణు ట్వీట్ చదవండి: వైరల్ అవుతున్న మంచు విష్ణు 'డైలాగ్'

మంచు మోహన్ బాబు కుటుంబంలో కొన్నిరోజులుగా వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం మంచు మనోజ్ తన భార్యతో కలిసి మోహన్ బాబు యూనివర్సిటీకి వచ్చిన సమయంలో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. తనపై, తన భార్య మౌనికపై దాడి జరిగిందని మనోజ్ చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు అనుమతులు లేకుండా మనోజ్ యూనివర్సిటీలోకి వచ్చే ప్రయత్నం చేశారని మోహన్ బాబు వర్సిటీ వర్గాలు ఫిర్యాదు చేశాయి. దీంతో పోలీసులు మరో రెండు కేసులు నమోదు చేశారు.

More Telugu News