Sunil Kumar: సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై విచారణకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

AP Govt appointed two men authority for enquiry on former CID chief Sunil Kumar

  • గత ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్ గా వ్యవహరించిన సునీల్ కుమార్
  • సునీల్ కుమార్ పై అనేక ఆరోపణలు
  • ఇద్దరు అధికారులతో విచారణ అథారిటీ ఏర్పాటు చేసిన కూటమి సర్కారు

గత ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్ గా వ్యవహరించిన సునీల్ కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు అనేక ఆరోపణలు ఉన్నాయి. తాజాగా, సునీల్ కుమార్ పై విచారణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సునీల్ కుమార్ పై ఉన్న ఆరోపణల విచారణ కోసం ప్రత్యేకంగా విచారణ అథారిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ అథారిటీలో ఇద్దరు విచారణ అధికారులను నియమించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, విజిలెన్స్ డీజీ హరీశ్ కుమార్ గుప్తా ఈ అథారిటీలో విచారణ అధికారులుగా వ్యవహరిస్తారు. సునీల్ కుమార్ పై విచారణ పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా నివేదిక అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.

  • Loading...

More Telugu News