Manu Bhaker: దేశం గర్వించేలా మరింత కష్టపడతా: మనూ భాకర్

మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు అందుకోవడంపై ఒలింపిక్ మెడలిస్ట్, భారత షూటర్ మనూ భాకర్ స్పందించారు. ఈ ప్రతిష్ఠాత్మకమైన పురస్కారం అందుకోవడం ఎంతో గౌరవంగా ఉందన్నారు. ఈ గౌరవం దేశం గర్వించేలా మరింత కష్టపడి పనిచేయడానికి స్ఫూర్తిని ఇస్తుందన్నారు. ఈ మేరకు మనూ భాకర్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఓ పోస్టు చేశారు.
"గౌరవనీయులైన రాష్ట్రపతి నుంచి ప్రతిష్ఠాత్మకమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డును అందుకున్నందుకు నేను ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఈ గుర్తింపు నా దేశం గర్వపడేలా మరింత కష్టపడి పనిచేయడానికి, మరిన్ని విజయాల కోసం ప్రయత్నించడానికి నాకు స్ఫూర్తినిస్తుంది. నా ప్రయాణంలో నాకు మద్దతుగా, మార్గనిర్దేశం చేసిన మరియు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని మనూ భాకర్ ట్వీట్ చేశారు.