Bobby Deol: 'వీరమల్లు' లాంటి కథలు అరుదుగా వస్తాయి... మూవీ స్క్రిప్ట్ చాలా ప్రత్యేకం: బాబీ డియోల్

- 'డాకు మహారాజ్' సినిమాతో బాబీ డియోల్ టాలీవుడ్‌లో స్ట్రాంగ్ ఎంట్రీ
- 'హరిహర వీరమల్లు'లోనూ కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు
- తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'వీరమల్లు' విశేషాలను పంచుకున్న వైనం
- చరిత్రలో జరిగిన కథలు ఎమోషనల్‌గానే కాకుండా మాస్‌గానూ ఉంటాయని వ్యాఖ్య
- ఇలాంటి ప్రత్యేకమైన చిత్రంలో భాగమైనందుకు ఆనందంగా ఉందన్న బాబీ డియోల్
సంక్రాంతి కానుకగా వచ్చిన 'డాకు మహారాజ్' సినిమాతో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ టాలీవుడ్‌లో స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీలో ప్రతినాయకుడిగా ఆయన తనదైన నటనతో ఆకట్టుకున్నారు. కాగా, ఈ చిత్రానికి ముందే బాబీ డియోల్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు'లో అవకాశం దక్కించుకున్నారు.
తాజాగా ఈ చిత్రం విశేషాలను ఆయన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 'వీరమల్లు' స్క్రిప్ట్ చాలా ప్రత్యేకమని అన్నారు. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయని తెలిపారు. చరిత్రలో జరిగిన కథలు భావోద్వేగపూరితంగానే కాకుండా మాస్‌గానూ ఉంటాయని ఈ స్టోరీ విన్నప్పుడే అర్థమైందని చెప్పారు. ఇలాంటి ప్రత్యేకమైన చిత్రంలో భాగమైనందుకు ఆనందంగా ఉందన్నారు.
ఇక పవన్ కల్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ 'మాట వినాలి' అంటూ సాగే పాటను ఈరోజు మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను స్వయంగా పవన్ పాడడం విశేషం.
ఈ చిత్రంలో పవన్ సరసన హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఈ మూవీకి ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మార్చి 28న ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది.