Mohan Babu: మోహన్ బాబు ఫ్యామిలీ గొడవ... చంద్రగిరిలో రెండు కేసులు నమోదు!

2 more cases filed on Mohan Babu family

  • మోహన్ బాబు యూనివర్శిటీ వద్ద ఉద్రిక్తత
  • మోహన్ బాబు పీఏ ఫిర్యాదుతో మనోజ్, మౌనికలపై కేసు
  • మనోజ్ ఫిర్యాదుతో మోహన్ బాబు పీఏతో పాటు 8 మందిపై కేసు

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ వివాదం హైదరాబాద్ నుంచి ఏపీకి షిఫ్ట్ అయింది. రెండు రోజుల క్రితం తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్శిటీ వద్ద ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. యూనివర్శిటీలోకి తనను అనుమతించకపోవడంతో మంచు మనోజ్ రచ్చ చేశారు. ఈ క్రమంలో మోహన్ బాబు, మనోజ్ బౌన్సర్లు కొట్టుకున్నారు.  

ఈ నేపథ్యంలో ఇరు వర్గాలపై చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. మోహన్ బాబు పీఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనికతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదైంది! 

మరోవైపు తనపై, తన భార్యపై దాడికి దిగారంటూ మనోజ్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు మోహన్ బాబు పీఏతో పాటు 8 మంది మోహన్ బాబు యూనివర్శిటీ సిబ్బందిపై కేసు నమోదయింది!.


  • Loading...

More Telugu News