BTech Ravi: టీడీపీ ఎమ్మెల్సీ అనుచరుడిని చితకబాదిన బీటెక్ రవి అనుచరులు

BTech Ravi followers beats TDP MLC follower

  • రాంగోపాల్ రెడ్డి అనుచరుడిపై దాడి
  • ఎగ్జామ్ రాసేందుకు వెళ్తున్న ప్రకాశ్ ను చితకబాదిన వైనం
  • నిన్న సాయంత్రం కలెక్టరేట్ ముందు రచ్చ చేసిన బీటెక్ రవి అనుచరులు

కడప జిల్లా పులివెందుల టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అనుచరుడు, వేంపల్లికి చెందిన ప్రకాశ్ రేషన్ షాప్ కోసం పులివెందులలోని పాఠశాలలో పరీక్ష రాసేందుకు వచ్చాడు. ఎగ్జామ్ రాసేందుకు వెళ్తున్న అతడని బీటెక్ రవి అనుచరులు చితకబాదారు. ఆయనను తమ అదుపులోకి తీసుకున్నారు. 

ఈ నేపథ్యంలో ప్రకాశ్ ను వదిలిపెట్టాలని కోరుతూ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి భార్య ఉమాదేవి ధర్నాకు దిగారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో ప్రకాశ్ ను బీటెక్ రవి అనుచరులు వదిలేశారు. మరోవైపు, ఇసుక టెండర్ల కోసం నిన్న సాయంత్రం బీటెక్ రవి అనుచరులు రచ్చ చేశారు. ఈ ఘటన జరగక ముందే ఆయన అనుచరులు ఈరోజు మరోసారి రెచ్చిపోయారు.

  • Loading...

More Telugu News