Sankranthiki Vasthunam: భారీ వసూళ్ల‌తో దూసుకెళ్తున్న‌ 'సంక్రాంతికి వ‌స్తున్నాం'.. మూడు రోజుల్లోనే రూ. 106 కోట్లు!

Sankranthiki Vasthunam Collects Rs 106 Crore Gross worldwide in 3 Days

  • వెంక‌టేశ్, అనిల్ రావిపూడి కాంబోలో 'సంక్రాంతికి వ‌స్తున్నాం'
  • సంక్రాంతి కానుక‌గా మంగ‌ళ‌వారం నాడు విడుద‌లైన సినిమా
  • మొద‌టి ఆట నుంచే మూవీకి పాజిటివ్ టాక్
  • క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ కావ‌డంతో చిత్రానికి భారీ క‌లెక్ష‌న్స్‌

విక్ట‌రీ వెంక‌టేశ్ హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన తాజా సినిమా 'సంక్రాంతికి వ‌స్తున్నాం'. సంక్రాంతి కానుక‌గా మంగ‌ళ‌వారం నాడు విడుద‌లైన ఈ సినిమా మొద‌టి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రం భారీ వ‌సూళ్లతో దూసుకెళ్తోంది. 

క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ కావ‌డం, పైగా సంక్రాంతి పండ‌గ సీజ‌న్‌కు రావ‌డంతో సినిమా భారీ క‌లెక్ష‌న్లను రాబడుతోంది. ఈ మూవీ మూడు రోజుల్లోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 106 కోట్లు (గ్రాస్) వసూలు చేసిందని తాజాగా మేక‌ర్స్‌ ప్ర‌క‌టించారు. 

ఎనీ సెంట‌ర్ సింగిల్ హ్యాండ్‌.. విక్ట‌రీ వెంక‌టేశ్ అంటూ స్పెష‌ల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో వెంకీమామ అభిమానులు త‌మ హీరోను పొగుడుతూ సోష‌ల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. కాగా, ఈ చిత్రానికి తొలి రోజు వ‌రల్డ్ వైడ్‌గా రూ. 45 కోట్ల (గ్రాస్) వ‌సూళ్లు వ‌చ్చాయి. రెండు రోజుల్లోనే రూ. 77 కోట్ల (గ్రాస్‌)కు చేరాయి. ఇప్పుడు మూడు రోజుల్లోనే సినిమా వంద కోట్ల క్ల‌బ్‌లోకి చేరింది. 

ప్ర‌ముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ కలిసి నిర్మించిన‌ ఈ సినిమాకు భీమ్స్ అద్భుత‌మైన బాణీలు అందించారు. మూవీ ఆల్బ‌మ్‌లోని దాదాపు అన్ని పాట‌లు సూప‌ర్ హిట్‌గా నిలిచాయి. వెంకీ స‌ర‌స‌న‌ ఐశ్వ‌ర్య రాజేశ్‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టించారు.

More Telugu News