Ponnala Lakshmaiah: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ

Theft in Ponnala Lakshmaiah home

  • గత శుక్రవారం రాత్రి పొన్నాల ఇంట్లో చోరీ
  • లక్షన్నర నగదుతో పాటు భారీగా ఆభరణాలను దోచుకెళ్లిన దొంగలు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన పొన్నాల భార్య అరుణాదేవి

హైదరాబాద్, ఫిలిం నగర్ లోని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగింది. గత శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పొన్నాల ఇంట్లో లక్షన్నర నగదుతో పాటు భారీగా ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. చోరీ ఘటనపై ఫిలింనగర్ పోలీసులకు పొన్నాల భార్య అరుణాదేవి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నారు. 

  • Loading...

More Telugu News