swami sivananda: ఆయన వయసు 129... వందేళ్లుగా ప్రతి కుంభమేళాకు వస్తున్నాడు!

129 years swami sivananda has attended every kumbh mela in 100 years

  • ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహా కుంభమేళా
  • మహా కుంభమేళాలో పాల్గొన్న 129 ఏళ్ల స్వామి శివానంద బాబా
  • శివానంద బాబాను పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్న భక్తులు

ప్రయాగ్‌రాజ్ లో కొనసాగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. మూడు రోజుల వ్యవధిలోనే ఆరు కోట్ల మందికిపైగా హాజరై గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో పుణ్యస్నానాలు ఆచరించారు. 

ఈ క్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత, యోగా సాధకుడు 129 సంవత్సరాల స్వామి శివానంద బాబా ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో పాల్గొన్నారు. ఆయన గత వందేళ్ల నుంచి ప్రయాగ్ రాజ్, నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్ లలో జరిగిన అన్ని కుంభమేళాలకు హజరయ్యారని ఆయన శిష్యులు తెలిపారు. ఆయన క్రమం తప్పకుండా యోగా చేస్తారని పేర్కొన్నారు.

ఆయనకు సెక్టార్ 16లో క్యాంపు ఏర్పాటు చేయగా, స్వామి శివానందను సందర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరుతున్నారు. యోగా సాధకుడుగా ఉన్న ఆయన్ను గుర్తించిన ప్రభుత్వం 2022లో పద్మశ్రీతో సత్కరించింది. నిరాడంబర జీవితం గడుపుతూ యోగ, ధ్యానంలో విశేష సేవలందించినందుకు గాను ఈ పురస్కారం అందుకున్నారు. 

  • Loading...

More Telugu News