Brahma Anandam Teaser: 'బ్రహ్మా ఆనందం' టీజర్ విడుదల.. ఆకట్టుకుంటోన్న బ్రహ్మీ, గౌతమ్, వెన్నెల కిశోర్‌ల కామెడీ

- బ్రహ్మానందం, రాజా గౌతమ్... తాత, మనవడిగా నటిస్తున్న చిత్రం 'బ్రహ్మా ఆనందం'
- టీజర్‌లో వెన్నెల కిశోర్, గౌతమ్‌ల కామెడీ అదుర్స్
- ఈ మూవీకి ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వం
- ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
తండ్రీకొడుకులు బ్రహ్మానందం, రాజా గౌతమ్... తాత, మనవడిగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఈ మూవీలో మరో కమెడియన్ వెన్నెల కిశోర్ కీరోల్‌లో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఒక నిమిషం 53 సెకన్ల నిడివితో ఉన్న ఈ టీజర్ ఆకట్టుకుంటోంది.
టీజర్‌లో వెన్నెల కిశోర్, గౌతమ్‌ల కామెడీ అదిరిపోయింది. బ్రహ్మానందం ఎంట్రీతో పాటు ఆయన సీన్స్ చాలా బాగున్నాయి. చివరలో ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. మొత్తంగా ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్న ఈ మూవీకి ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రం యూనిట్ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. అందులో భాగంగా తాజాగా టీజర్‌ను విడుదల చేసింది.