KTR: ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్.. ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

KTR reaches ED office

  • ఫార్ములాా ఈ-కార్ రేసు కేసులో ఈడీ విచారణకు కేటీఆర్
  • ఈడీ కార్యాలయం వద్ద మోహరించినం 200 మంది పోలీసులు
  • బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకుంటున్న పోలీసులు

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఈడీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. తన నివాసం నుంచి నేరుగా ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. సుమారు 200 మంది పోలీసులు అక్కడ మోహరించారు. 

ఇంకోవైపు పెద్ద సంఖ్యలో ఈడీ కార్యాలయం వద్దకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఒక్కొక్కరిని పోలీసులు అదుపులోకి తీసుకుని గోషామహల్ స్టేడియంకు తరలిస్తున్నారు.  

మరోవైపు ఈ కేసులో ఇప్పటికే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను ఈడీ విచారించింది. వారు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కేటీఆర్ ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈడీ కార్యాలయంలోకి కేటీఆర్ మినహా మరెవరినీ అనుమతించలేదు.

KTR
BRS
Formula E Race Case
Enforcement Directorate
  • Loading...

More Telugu News