Israel-Hamas War: 15 నెలల యుద్ధానికి స్వస్తి.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన ఒప్పందం

Israel and Hamas reach ceasefire deal to end 15 month Gaza war

  • కొన్ని నెలలుగా జరుగుతున్న దౌత్యం అనంతరం శాంతి ఒప్పందం
  • ఈజిప్ట్, ఖతర్‌, ఇజ్రాయెల్ తో కలిసి అమెరికా చర్చలు
  • తొలుత ఆరు నెలలపాటు కాల్పుల విమరణ
  • గాజా నుంచి వైదొలగనున్న ఇజ్రాయెల్ దళాలు
  • బందీలను విడిచిపెట్టనున్న హమాస్
  • మూడు దశలుగా అమలు కానున్న ఒప్పందం

ఇజ్రాయెల్-హమాస్ మధ్య 15 నెలలుగా జరుగుతున్న యుద్ధానికి ఫుల్‌స్టాప్ పడింది. ఇరు దేశాలు శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. గాజాలో కాల్పుల విరమణకు అంగీకరించిన ఇజ్రాయెల్ తమ దళాలను వెనక్కి తీసుకునేందుకు ఓకే చెప్పగా, తమ అధీనంలో ఉన్న బందీలను విడిచిపెట్టేందుకు హమాస్ మిలిటెంట్ గ్రూప్ అంగీకరించడంతో కథ సుఖాంతమైంది. 

ఈజిప్ట్, ఖతర్, ఇజ్రాయెల్‌తో కలిసి తాము కొన్ని నెలలపాటు జరిపిన దౌత్యం అనంతరం ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. ఈ ఒప్పందంతో గాజాలో పోరాటాన్ని ఇజ్రాయెల్ నిలిపివేస్తుందని పేర్కొన్నారు. 15 నెలలపాటు హమాస్ చెరలో బందీలుగా ఉన్నవారు ఈ ఒప్పందంతో విడుదల కానున్నారు. తొలుత ఆరు వారాలపాటు కుదిరిన ఒప్పందం ఈ నెల 19 నుంచి అమల్లోకి రానుంది. 

మొత్తం మూడు దశలుగా ఈ ఒప్పందం అమలవుతుంది.  గాజా నుంచి ఇజ్రాయెల్ తమ దళాలను ఉపసంహరించుకోవడంతోపాటు తమ జైళ్లలో మగ్గుతున్న హమాస్ ఉగ్రవాదులను విడిచిపెట్టడం విడతల వారీగా జరగనుంది.  ప్రతిగా తమ వద్ద బందీలుగా ఉన్న వారిని హమాస్ విడిచిపెట్టనుంది. ఒక్కో దశలో ఒక్కో ఒప్పందం అమలవుతుంది.  ఇరు దేశాల మధ్య ఈ శాంతి ఒప్పందంలో బైడెన్ కీలకంగా వ్యవహరించారు. యుద్ధానికి శాశ్వతంగా ముగింపు పలకడంపై వచ్చే ఆరు నెలల్లో ఇజ్రాయెల్ చర్చలు జరపనుంది. అవసరమైన ఏర్పాట్లు చేయనుంది. 

  • Loading...

More Telugu News