Entrance Exams: తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు వచ్చేశాయ్!

- గతంలో కంటే ఈసారి ఆలస్యంగా పరీక్షలు
- ఎప్‌సెట్‌తో ప్రారంభమై పీఈసెట్‌తో ముగియనున్న ఎగ్జామ్స్
- ఈసారి ఆన్‌లైన్‌లో నెట్ నిర్వహణ
తెలంగాణలో పలు ప్రవేశ పరీక్షలకు సంబంధించిన తేదీలను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. గతంలో కంటే ఈసారి ఆలస్యంగా పరీక్షలు నిర్వహించనున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్‌సెట్‌తో (ఏప్రిల్ 29, 30)తో పరీక్షలు ప్రారంభమై జూన్ 11 నుంచి 14 వరకు జరిగే పీఈసెట్‌తో పరీక్షలు ముగుస్తాయి.
సాధారణంగా ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత ఎప్‌సెట్‌కు 45 రోజుల సమయం ఉండేది. అయితే, ఈసారి అగ్రికల్చర్ విద్యార్థులకు 39 రోజులు, ఇంజినీరింగ్ వారికి 42 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. జూన్‌లో ఏకంగా ఐదు పరీక్షలు జరగనుండటంతో ఏప్రిల్ నెలాఖరులోనే ఎప్‌సెట్ నిర్వహించనున్నారు. అలాగే, ఈసారి నీట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. మే 6 నుంచి పది రోజులపాటు ఇవి జరుగుతాయి.
పరీక్షల షెడ్యూల్ ఇలా
- అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాలకు నిర్వహించే ఎప్‌సెట్ - ఏప్రిల్ 29, 30
- బీటెక్‌లో ప్రవేశాలకు ఎప్‌సెట్ - మే 2-5
- బీటెక్, ఫార్మసీలోకి లేటరల్ ఎంట్రీ కోసం - ఈసెట్ మే 12
- బీఈడీలో ప్రవేశాలకు ఎడ్ సెట్ - జూన్ 1
- ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎంలో ప్రవేశాలకు లాసెట్ - జూన్ 6
- ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాలకు - ఐసెట్ జూన్ 8, 9
- ఎంటెక్, ఎంఫార్మసీ తదితర వాటిలో ప్రవేశాలకు - పీజీఈసెట్ జూన్ 16-19
- డీపీఎడ్, బీపీఎడ్‌లో ప్రవేశాలకు - పీఈసెట్ జూన్ 11-14